Breaking News

ఆవులు, గేదెలు, ఒంటెలు బలివ్వడం చట్టరీత్యా నేరం

నిజామాబాద్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా బక్రీద్‌ పండుగను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాల‌ని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తీసుకోవల‌సిన జాగ్రత్తలు పాటిస్తూ బక్రీద్‌ పండగ జరుపుకోవాల‌ని ఎట్టి పరిస్థితుల్లో ఆవులు, గేదెలు, ఒంటెలు బలి ఇవ్వడం చేయరాదని, అది చట్టరీత్యా నేరమని, ప్రార్థనలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాల‌న్నారు.

ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడ రాదన్నారు. జిల్లాలో 11 చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్‌ పాయింట్లను పోలీస్‌, వెటర్నరీ, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌ మెంట్‌ అధికారుల‌తో కలిపి ఏర్పాటు చేయనైనదన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో బక్రీద్‌ పండుగకి కావల‌సిన ఏర్పాట్లు చేయాల‌ని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మూడు డివిజన్లలో కాటరింగ్‌ హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయడమైనదని, హోల్డింగ్‌ పాయింట్లలో గడ్డి, నీరు, దాన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

కరోనా సందర్భంగా ముస్లిం సోదరులంతా సామాజిక దూరం పాటిస్తూ బక్రీద్‌ పండుగ జరుపుకోవాల‌ని కోరారు. క్యాటరింగ్‌ హోల్డింగ్‌ పాయింట్‌లో నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనం తనిఖీ చేయబడుతుందని, అతిక్రమించిన వారిపై మునిసిపల్‌ యాక్ట్‌ ప్రకారంగా చర్యలు ఉంటాయని తెలిపారు.

పరిశుభ్రత పాటించాల‌ని రోడ్లపైన డ్రైనేజీలో వేస్టేజ్‌ వేయరాదని, మున్సిపల్‌ సిబ్బంది వచ్చినప్పుడు వేస్టేజ్‌ వాళ్లకు అందివ్వాల‌ని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిపిఓ జయసుధ, స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ మధుసూదన్‌, ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్‌ వెంకటరమణ, పశుసంవర్ధక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article