హైదరాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాయం నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్‌కు రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్లోడు, ప్రవేశ పరీక్ష తేదీ వివరాను త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.
Read More »Daily Archives: July 26, 2020
ఆపదలో ముందుండేది వైద్యులే
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ ఆపద వచ్చినా ముందు నిలబడేది ప్రభుత్వ వైద్యులేనని, వైద్యులు కనబడని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నారని, వైద్యుల సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో ఆదివారం వైద్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాధికి భయపడకుండా వైద్యులు ప్రజలకు భరోసా ఇచ్చి వైద్యం అందించాలని సూచించారు. కష్టకాలంలో ...
Read More »అత్యవసర సమయంలో రక్తదానం
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి రక్తలేమితో జికె హాస్పిటల్లో చికిత్స పొందుతూ అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని టీజీవిపి నాయకులను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్ స్పందించి ఏ పాజిటివ్ రక్త దాత కామారెడ్డి పట్టణానికి చెందిన రంజిత్, ధర్మారం గురుకుల జూనియర్ అసిస్టెంట్‌తో మాట్లాడి సేవ దృక్పధంతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో టీజీవిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ...
Read More »సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడడం ముఖ్యం
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ -19 కేసులు, మరణాల వాస్తవ గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. జూలై 25 నాటికి (రాత్రి 8 గంటల వరకు) కేసుల కోసం కోవిడ్ -19 కేసులు స్థితిగతులపై ప్రజారోగ్య డైరెక్టర్ జారీ చేసిన సవరించిన మీడియా బులెటిన్ గణాంకాలను దాచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని స్పష్టంగా తెలుపుతుందని షబ్బీర్ అలీ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ...
Read More »