Breaking News

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి రక్తలేమితో జికె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు.

టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి ఏ పాజిటివ్‌ రక్త దాత కామారెడ్డి పట్టణానికి చెందిన రంజిత్‌, ధర్మారం గురుకుల‌ జూనియర్‌ అసిస్టెంట్‌తో మాట్లాడి సేవ దృక్పధంతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో టీజీవిపి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ప్రతినిధులు శివకుమార్‌, అంజయ్య, బాల‌రాజ్‌, శ్రీకర్‌, వీటి ఠాగూర్‌ రక్తనిథి కేంద్రం నిర్వాహకుడు ఏసు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ...

Comment on the article