Breaking News

08462 220183 ప్రజావాణి ఫోన్‌ ఇన్‌

నిజామాబాద్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ప్రతి సోమవారం కలెక్టరేటులో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫోన్‌ఇన్‌ ద్వారా ఫిర్యాదుల‌ను స్వీకరించుటకు కలెక్టర్‌ చాంబర్‌లో ఫోన్‌ఇన్‌ కార్యక్రమం ప్రారంభించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఫిర్యాదుదారులు తమ ఇంటి నుండే ఫోను ద్వారా 08462 220183 నెంబర్‌ కు ఉదయం 10-30 గంటల‌ నుండి మధ్యాహ్నం 2 గంటల‌ వరకు తమ తమ ఫిర్యాదులు తెలియజేయటానికి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సౌకర్యాన్ని వినియోగించుకొని ఎవరు ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాల‌ని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, మాస్కులు తప్పక ధరించాల‌ని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని తెలిపారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article