Breaking News

వారిపై చర్య తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం షేర్‌బి పేట గ్రామానికి చెందిన అస్క కర్ణాకర్‌ కుటుంబ సభ్యుల‌ను నాలుగు కుటుంబాల‌ను కుల‌ బహిష్కరణ చేసిన దాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాల‌ని, బహిష్కరణకు కారణమైన కుల‌ సంఘం పెద్దమనిషి కుమార్‌ రవి తదితరుల‌పై చట్టపరమైన చర్య తీసుకొని వారికి న్యాయం చేయాల‌ని, జిల్లా ఎస్పీకి అదేవిధంగా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు.

ఈ సందర్భంగా అస్క కర్ణాకర్‌, అస్క కనకరాజు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ గత నెల‌ రోజుల‌ క్రితం మహేందర్‌ అనే వ్యక్తితో చిన్నపాటి గొడవ జరిగితే బిబీపేట పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆధ్వర్యంలో కాంప్రమైజ్‌ చేయడం జరిగిందని, ఈనెల‌ 25వ తేదీన కుల‌ చిట్టి డబ్బు తీసుకోకుండా కులం నుంచి ఐదు కుటుంబాల‌ను వెలివేయడం, ఏ సంబంధాలు పెట్టుకోవద్దని ఎవరు వాడితో మాట్లాడొద్దని ఎవరు కల‌వకూడదని షరతులు విధించడం ఇలాంటి అనాగరికమైన చర్యలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి, జిల్లా కలెక్టర్‌ శరత్‌ కుమార్‌, స్థానిక ఎస్‌ఐ చట్టపరమైన చర్యలు చేపట్టాల‌ని డిమాండ్‌ చేశారు.

కుల‌ బహిష్కరణ తక్షణం ఎత్తివేయకుంటే మానవ హక్కుల‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపడతామని రాజలింగం హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article