Breaking News

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామారెడ్డి, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కరోనా వ్యాధి బారిన పడి కొందరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కరోణ వ్యాధికి మందు లేకపోవడం వల‌న ఎవరికైతే కరోణ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు ప్లాస్మా దానం చేసినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో చాలామంది కరోణ వ్యాధి నుంచి కోలుకుని నెగిటివ్‌ ఫలితాలు రావడం జరిగిందని వీరందరూ ప్లాస్మా దానం చేయడానికి అర్హుల‌న్నారు. వీరిచ్చే ప్లాస్మా ద్వారా ఐసీయూలో చావు బ్రతుకుల‌ మధ్య ఉన్న వ్యక్తుల‌ను కాపాడవచ్చన్నారు. ఎవరైనా ప్లాస్మా దానం చేయాల‌నుకుంటే 9492874006 నెంబర్‌లో సంప్రదించాల‌న్నారు. ప్లాస్మా దానం చేసి ప్రాణాల‌ను కాపాడాల‌ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సభ్యులు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, టెక్నీషియన్‌ ప్రమోద్‌ పాల్గొన్నారు.

Check Also

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ...

Comment on the article