Breaking News

31 లోపు పంటలు నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రైతులందరూ జూలై 31 లోపు పంటలు నమోదు చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ పంటలు వేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారుల‌ వద్ద నమోదు చేసుకోవాల‌ని, వేసిన పంటలు నమోదు చేసుకోవడానికి రైతుల‌ వెంట పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకోవాల‌న్నారు.

ఏ ఏ సర్వేనెంబర్లో ఏ ఏ పంటలు వేశారో వాటి వివరాలు తెలియజేయాల‌ని, నీటి పారుదల‌ కింద వేసిన పంటలు, మెట్ట పంట వివరాలు ఏఈఓల‌కు తెలియచేయాల‌న్నారు. రైతు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాల‌ని, వేసిన పంటలు నమోదు చేయని రైతుల‌కు పంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఏర్పడవచ్చని, పంటలు మద్దతు ధరకు అమ్ముకోవడానికి సమస్యలు ఎదురవవచ్చని, ప్రభుత్వం పంట నమోదు చేసిన విస్తీర్ణాన్ని బట్టి పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

గత సంవత్సరం రైతుల‌కు ఇబ్బంది ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వం పంట నమోదు కార్యక్రమం చేపట్టిందన్నారు. కోవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల‌ దృష్ట్యా ఏఈఓకు రైతులంతా సహకరించాల‌ని, ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సభ్యులు సహకరించి పంట నమోదు చేయించాల‌న్నారు. కోవిడ్‌ దృష్ట్యా కొన్ని గ్రామాలు స్వీయ నిర్బంధంలో ఉన్నాయని తెలియజేయడం జరిగిందని, నిత్యావసర సరుకుల‌తో సమానంగా పంట నమోదు కార్యక్రమానికి కూడా మినహాయింపు ఉంటుందని తెలిపారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article