Breaking News

వ్యక్తిగత క్రమశిక్షనే నిజమైన దేశభక్తి

నిజామాబాద్‌, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తిగత క్రమశిక్షనే నిజమైన దేశభక్తి అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి అన్నారు. నిజామాబాద్‌ నగరం ఎల్ల‌మ్మ గుట్ట విశ్వతేజస్‌ శిక్షణ సంస్థ కార్యాల‌యంలో అబ్దుల్‌ కలామ్‌ ఐదవ వర్ధంతిని సోమవారం వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌, విశ్వతేజస్‌ సంస్థ ఆద్వర్యంలో నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

విశ్వతేజస్‌ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ కలామ్ కల‌లు గన్న భారతావనిని నిర్మింపజేయడమే విశ్వతేజస్‌ సంస్థ ఉద్దేశమని చెప్పారు. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల‌ వరుసలో భారత్‌ను నిల‌పడానికి అందరూ కృషి చేయాల‌న్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఉన్నత ఆవిష్కరణల‌కై కృషి చేయాల‌ని సూచించారు.

కలామ్‌ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ జిల్లా సమన్వయ కర్త తక్కురి హన్మాండ్లు, ప్రతినిధులు పెందోటి చంద్రశేఖర్‌, సతీష్‌, మైత్రి గంగాధర్‌, ఆదిత్య, శేఖర్‌, నరహరి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article