Breaking News

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి, సదాశివనగర్‌, ధర్మారావు పేట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను, గుత్తేదారును ఆదేశించారు.

పల్లె ప్రగతి పనులు జులై 31లోగా పూర్తిచేయాల‌ని సర్పంచుకు సూచించారు. డంపింగ్‌ యార్డు, స్మశాన వాటిక నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేయాల‌ని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, మండల‌ పరిషత్‌ ఉపాధ్యక్షుడు గాదరి శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచు పైడి జానకి, బద్దం శ్రీనివాస్‌ రెడ్డి, బడా భాస్కర్‌ రెడ్డి , తహసిల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో అశోక్‌, సహకార సంఘం అధ్యక్షుడు కమలాక‌ర్‌ రావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article