Breaking News

పనుల్లో జాప్యం చేస్తే బిల్లులు రావు

కామారెడ్డి, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు వేగవంతం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, గాంధారి మండలం దుర్గం, గాంధారిలోని రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 లోగా భవనాల‌ నిర్మాణం పనులు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

గుత్తేదారులు పనుల్లో జాప్యం చేస్తే బిల్లులు రావని సూచించారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడాల‌న్నారు. గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వ‌ల్ల‌ నూతన శోభ సంతరించుకోనున్నాయని పేర్కొన్నారు. డంపింగ్‌ యార్డుల‌ను పూర్తి చేసి సేంద్రియ ఎరువులు సంపద కేంద్రాలుగా మార్చాల‌ని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్‌ పనుల‌ను ఈనెల‌ 31లోగా పూర్తిచేయాల‌ని సర్పంచుల‌ను కోరారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ సిద్ధిరాములు, ఎంపీడీవోలు రవిఈశ్వర్‌ గౌడ్‌, ల‌క్ష్మి, తహసిల్దార్‌ నాగరాజు గౌడ్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article