Breaking News

టగ్‌ ఆఫ్‌ వార్‌లో జాతీయస్థాయికి

కామారెడ్డి, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల‌ విద్యార్థులు మహారాష్ట్రలోని సాంగ్లి దగ్గర మీరాజ్‌ అనే ప్రాంతంలో జనవరి 2వ తేదీ 2020 నుండి జనవరి 7 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో అండర్‌ 15, అండర్‌ 17 లో ద్వితీయ స్థానం, వరుసగా తృతీయ స్థానం పొందారు. కరోన ప్రభావం చేత ప్రశంసా పత్రాలు అందజేయలేకపోయారు. కాగా 27వ తేదీ సోమవారం హైద్రాబాద్‌లో లాల్‌బహుదర్‌ స్టేడియంలో అధికారులు విద్యార్థుల‌కు ప్రశంసా పత్రాలు అందచేశారు.

అండర్‌ 17 విభాగంలో ఎల్‌.నవీన్‌, డి.విజయ్‌, భారత్ ప‌త‌కాలు సర్టిఫికెట్లు సాధించగా, అండర్‌ 15 లో ప్రశాంత్‌, సంపత్‌ కుమార్‌, ప్రభాస్‌ తృతీయ స్థానంలో నిలిచారు. పి.డి నర్సింహ రెడ్డి విద్యార్థుల‌ను అభినందిస్తూ క్రీడల్లో రాణించిన వారికి మంచి ఉద్యోగ అవాకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. పి.డి నర్సింహ రెడ్డి కృషి వ‌ల్ల‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే టగ్‌ ఆఫ్‌ వార్‌లో జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది.

అర్చరీ, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖోలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్ల‌ల‌ ఆసక్తిని గమనించి ప్రతి పోటీలో పాల్గొనే విధంగా ప్రోత్సహించి ఆర్ధిక సహాయం కూడా చేస్తారు. వారి సేవల‌కు ఉత్తమ పి డి.గా అప్పటి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ చేతుల‌ మీదుగా అవార్డ్‌ పొందారు. ప్రధానోపాధ్యాయులు సంతోష్‌ రెడ్డి సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల‌ను, పాఠశాల‌కు పెరుతెచ్చిన పి.డిని ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

అందరు సహకరించండి…

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారితో కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు కేసులు ...

Comment on the article