Breaking News

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో గత సంవత్సర కాలం నుంచి ఉంటున్న నిజామాబాద్‌కు చెందిన ల‌క్ష్మి (82) మంగళవారం చనిపోయారు. ఆమె కుమారుడు వ్యవసాయదారుడు. అప్పుల బాధలు భరించలేక రెండేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం దిక్కులేని స్థితిలో కామరెడ్డి వృద్ధాశ్రమంలో ఉంటుంది.

ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. వారి బంధువుల‌కు సమాచారం అందించినా స్పందించకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు బాంబే క్లాథ్‌ హౌజ్‌ యజమాని అంత్యక్రియలు నిర్వహించాల‌ని కోరారు. మానవతా దృక్పథంతో స్పందించి సొంత ఖర్చుతో తమ సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article