Breaking News

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయుటకు 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్టు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు నెల‌కు రూ.40270 జీతంతో పాటు తగు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందని, ఎంబీబీఎస్‌ విద్యార్హత కలిగి ఆసక్తి కల‌ అభ్యర్థులు ఈ నెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటల‌ నుండి 5 గంటల‌ వరకు నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావల‌సిందిగా జిల్లా కలెక్టర్‌ కోరారు.

అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్‌ ధ్రువ పత్రాలు ఎస్‌ఎస్‌సి, ఎంబిబిఎస్‌, సమీకృత కుల‌ దృవీకరణ పత్రం ఫోటో కాపీలు, ఇటీవల‌ తీసుకున్న రెండు కల‌ర్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోల‌తో సహా టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌తో హాజరు కావాల‌ని ఆయన కోరారు. ఈనెల‌ 27న హైదరాబాదులో నిర్వహించిన వాక్‌ ఇన్‌ ఇంటర్యూకు హాజరైన డాక్టర్లు తిరిగి నిజామాబాద్‌లో నిర్వహించే వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Check Also

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు ...

Comment on the article