Breaking News

Daily Archives: July 29, 2020

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ...

Read More »

వరద నీటితో వాహనదారుల‌కు ఇబ్బందులు

నిజాంసాగర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌ రావు పల్లి గ్రామ శివారులో గల న‌ల్ల‌వాగు మత్తడి నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల‌కు న‌ల్ల‌వాగు మత్తడి పైనుంచి నీరు పొంగిపొర్లి వేగంగా ప్రవహిస్తుంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌, న‌ల్ల‌వాగు, సిర్గాపూర్‌, మాసన్‌ పల్లి, బాచపల్లి తదితర ప్రాంతాల‌లో కురిసిన భారీ వర్షాల‌కు వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. న‌ల్ల‌వాగు మత్తడి నీరు గోదావరిలోకి ప్రవహించడంతో నాగమడుగు మత్తడిలోకి నీటి ప్రవాహంతో ...

Read More »

పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 15 లోగా అన్ని గ్రామాల్లో ఎరువులు కంపోస్ట్‌ షెడ్ల‌ు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నాగిరెడ్డిపేట మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం అధికారుల‌తో సమీక్షించారు. తడి పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లో విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాల‌ని సూచించారు. మండలానికి పల్లె ప్రగతి కింద రూ.10.76 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్‌ ...

Read More »

నాణ్యత పాటించకపోతే చర్యలు

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. లింగంపేట మండలం పరిమళ, నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు, మాల్‌ తుమ్మెద రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను బుధవారం ఆయన పరిశీలించారు. భవనాల‌ నిర్మాణంలో నాణ్యత పాటించకపోతే ఇంజనీరింగ్‌ అధికారుల‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఎంపీడీవోలు మల్లికార్జున్‌ రెడ్డి, శ్యామల‌, ...

Read More »

న‌ల్ల‌వాగు జల‌కళ

నిజాంసాగర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గాపూర్‌ మండలంలోని న‌ల్ల‌వాగు మధ్య తరహా ప్రాజెక్ట్‌ లోకి మంగళవారం రాత్రి కురిసిన వర్షపు నీటికి జల‌కళ సంతరించుకున్న వేళ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి చేతుల‌ మీదుగా గంగమ్మకు తెప్ప విడిచి పూజ నిర్వహించి గేట్‌ ఎత్తి కాలువకు నీరు ప్రారంభించారు. వారితో పాటు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్‌ రాంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ నరేందర్‌ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్‌ ...

Read More »

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బి.నందిని హైదరాబాద్‌ లోని ప్రతిష్టాత్మమైన జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో గల‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఈ నెల‌ 27 వ తేదీన పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా సాధించారు. హైదరాబాద్‌లోని సిబిఐటిలో గల‌ ఇన్‌ ఫర్మేషన్‌ టెక్నాల‌జీలోని ప్రొఫెసర్‌ సురేష్‌ పబ్బోజు మరియు హైదరాబాద్‌లోని జెఎన్‌ టియూలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ ...

Read More »

పూర్తయిన పనుల‌ పరిశీన

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం, కాలూర్‌ గ్రామంలోని ఎల్ల‌య్య చెరువుకు ఆర్‌ఆర్‌ఆర్‌ క్రింద చేపట్టిన పనుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని ఎల్ల‌య్య చెరువుకు 62.12 ల‌క్షల‌ నిధుల‌తో చేపట్టిన మరమ్మతుల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిస్టోరేషన్‌, రిపేర్స్‌, రినోవేషన్‌ క్రింద నిజామాబాద్‌ జిల్లాలో 27 కోట్ల 78 ల‌క్షల‌తో 56 పనులు మంజూరు చేయడం జరిగిందని, ...

Read More »

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు తయారు చేసి, మంజూరు ఉత్తర్వులు తీసుకున్న పనుల‌ను వేగవంతం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రూరల్‌ డేవల‌ప్మెంట్‌, ఇర్రిగేషన్‌, ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ శాఖలో 201 పనులు మంజూరు కాగా 31 పనులు మొదలైనాయని, రోడ్లు, భవనాల‌ శాఖలో 436 పనుల‌కు ...

Read More »