Breaking News

నాణ్యత పాటించకపోతే చర్యలు

కామారెడ్డి, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. లింగంపేట మండలం పరిమళ, నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు, మాల్‌ తుమ్మెద రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను బుధవారం ఆయన పరిశీలించారు.

భవనాల‌ నిర్మాణంలో నాణ్యత పాటించకపోతే ఇంజనీరింగ్‌ అధికారుల‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఎంపీడీవోలు మల్లికార్జున్‌ రెడ్డి, శ్యామల‌, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article