Breaking News

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు తయారు చేసి, మంజూరు ఉత్తర్వులు తీసుకున్న పనుల‌ను వేగవంతం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు.

బుధవారం రూరల్‌ డేవల‌ప్మెంట్‌, ఇర్రిగేషన్‌, ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ శాఖలో 201 పనులు మంజూరు కాగా 31 పనులు మొదలైనాయని, రోడ్లు, భవనాల‌ శాఖలో 436 పనుల‌కు గాను 37 పనులు మొదల‌య్యాయని, ఇలా నత్త నడకన సాగితే ఎప్పటికి పూర్తి అవుతాయని అసహనం వ్యక్తం చేశారు. వారాంతంలోపు వీలైనన్ని ఎక్కువ పనులు ప్రారంభించాల‌ని ఆదేశించారు.

అలా అని అవసరమున్న, పనికి వచ్చే పనులు మాత్రమే చేపట్టాల‌ని, చేసిన పనుల‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మేసర్‌మెంట్స్‌ తీసుకొని చెల్లింపు చేయాల‌ని, వచ్చే వారంలోపు పనులు మొదలు కాకుంటే సంబంధిత అధికారుల‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీల‌తో మాట్లాడి పనులు మొదల‌య్యేలా చూడాల‌ని అన్నారు. అలాగే 384 గ్రామాల‌లో పార్కు పనులు మొదలు కావాల‌ని ఆయన అన్నారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article