Breaking News

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ఎంపీటీసీల‌కు, కార్యకర్తల‌కు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాసిటీవ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రతీ ఒక్కరు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే, మాస్క్‌ు ధరించి భౌతిక దూరాన్ని పాటించి రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం, కషాయం తీసుకోవాల‌ని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ కుడుముల‌ సత్యనారాయణ, మున్సిపల్‌ కౌన్సిల‌ర్‌ు, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌ ఎగుల‌ నర్సింలు, ఎల్లారెడ్డి సోసిటీ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ గౌడ్‌, మెట్ల సొసైటీ చైర్మన్‌ పటేల్‌ సాయిలు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌ పాల్గొన్నారు.

Check Also

అవసరమున్న రోగుల‌కు అందివ్వాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థకు సంబంధించిన కొత్త అంబులెన్స్‌ వాహనాన్ని ...

Comment on the article