Breaking News

పూర్తయిన పనుల‌ పరిశీన

నిజామాబాద్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం, కాలూర్‌ గ్రామంలోని ఎల్ల‌య్య చెరువుకు ఆర్‌ఆర్‌ఆర్‌ క్రింద చేపట్టిన పనుల‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని ఎల్ల‌య్య చెరువుకు 62.12 ల‌క్షల‌ నిధుల‌తో చేపట్టిన మరమ్మతుల‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిస్టోరేషన్‌, రిపేర్స్‌, రినోవేషన్‌ క్రింద నిజామాబాద్‌ జిల్లాలో 27 కోట్ల 78 ల‌క్షల‌తో 56 పనులు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా 62.12 ల‌క్షల‌ వ్యయంతో కాలూరు గ్రామంలోని ఎల్ల‌య్య చెరువుకు సంబంధించిన కట్టను గట్టిపరచడం, చెట్లు తొల‌గించడం, ఫీడర్‌ చానళ్ల పునర్వ్యవస్థీకరణ, ఇర్రిగేషన్‌ ఛానల్‌ గైడ్‌ వాల్‌ నిర్మాణం వంటి పనులు మంజూరు చేయడం జరిగిందని, పూర్తి అయిన పనుల‌ను బుధవారం పరిశీలించినట్టు తెలిపారు.

కలెక్టర్‌ వెంట ఇర్రిగేషన్‌ శాఖ ఎక్సిక్యూటివ్‌ ఇంజినీర్‌ భాను ప్రకాష్‌, డిఈ శాంతా బాయి, ఏఈ భూమన్న, రూరల్‌ తహసిల్దార్‌ ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల ...

Comment on the article