Breaking News

పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

కామారెడ్డి, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 15 లోగా అన్ని గ్రామాల్లో ఎరువులు కంపోస్ట్‌ షెడ్ల‌ు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నాగిరెడ్డిపేట మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం అధికారుల‌తో సమీక్షించారు. తడి పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లో విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాల‌ని సూచించారు.

మండలానికి పల్లె ప్రగతి కింద రూ.10.76 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. గ్రామాల్లో 85 శాతం మొక్కలు జీవించే విధంగా చూడాల‌ని సూచించారు. 37 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. గ్రామాల‌ సమగ్ర వివరాలు కార్యదర్శులు అందుబాటులో ఉంచుకోవాల‌ని పేర్కొన్నారు.

అన్ని గ్రామాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. ఎంపీపీ రాజుదాస్‌ మాట్లాడుతూ ఎంపీడీవో కార్యాల‌యంలో వర్షాలు ఉరుస్తుందని మరమ్మతు పనుల‌కు నిధు మంజూరు చేయాల‌ని కోర‌గా, రూపాయలు రెండు ల‌క్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. సమావేశంలో జడ్పిటిసి సభ్యుడు మనోహర్‌ రెడ్డి, ఎంపీడీవో శ్యామల‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article