Breaking News

Daily Archives: July 30, 2020

శీతల‌ శవ పేటిక వితరణ

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్య వైశ్య సంఘం పెద్ద కొడపగల్‌ వారి తరుపున శీతల‌ శవ పేటికను పెద్దకొడపగల్‌ గ్రామ పంచాయితీకి వితరణ చేశారు. కార్యక్రమంలో మండల‌ అధ్యక్షు శ్రీరామ్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షుడు వంగపల్లి అనిల్‌ కుమార్‌, గ్రామ సర్పంచ్‌ వంగలి తిర్మల్‌ రెడ్డి, పంచాయితీ సెక్రెటరీ, వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

రక్తదానం

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చెందిన హీనా అంజుమ్‌ 30 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ పట్టణ కేంద్రంలోని అఖిల‌ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో బిగ్‌ సి మొబైల్స్‌ స్టోర్‌ మేనేజర్‌ రమేష్‌ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర ...

Read More »

12 నుంచి నిరవధిక సమ్మె

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ సప్లై హమాలీల‌ గత ఒప్పందం డిసెంబర్‌ 31, 2019తో ముగిసిందని, నూతన వేతన ఒప్పందం జనవరి 1, 2020 లో అమలులోకి రావాల్సినా ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అమలు జరగలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య అన్నారు. ఈ మేరకు గురువారం ఏఐటీయూసీ జిల్లా కార్యాల‌యంలో సివిల్‌ సప్లై హమాలీ ముఖ్య కార్యకర్తల‌ సమావేశం నిర్వహించారు. అనంతరం సమ్మె నోటీసును సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డిఎం అభిజిత్‌ ...

Read More »

మనోధైర్యంతో ముందుకెళ్ళాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి విస్తరిస్తోందని, మండలాల్లో, గ్రామాల్లో కూడా కేసులు వస్తున్నాయని, ఇటువంటి సమయంలో మనం మనోధైర్యం తో ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఎమ్మార్వోలు, మెడికల్‌ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో మనం భయానికి లోను కాకుండా సంయమనంతో వ్యవహరించాల‌ని, ప్లాన్‌ ప్రకారం ముందుకు పోవాల‌ని సూచించారు. నిజామాబాద్‌లో ఇంతకు ముందు 12 కంటైన్మెంట్‌ జోన్లు పెట్టుకోవడమైనదని, అదేవిధంగా ...

Read More »

2020-21 వార్షిక ఋణ ప్రణాళిక విడుదల

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన 2020-21 వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి విడుదల‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కాంప్‌ కార్యాల‌యంలో జిల్లా వార్షిక ఋణ ప్రణాళికను విడుదల‌ చేసిన అనంతరం మాట్లాడారు. గత సంవత్సరం కంటే 412.18 కోట్ల అధిక మొత్తంతో రూపాయలు 6016.36 కోట్లతో ప్రణాళిక తయారు చేయడం జరిగిందని, ప్రాథమిక సెక్టార్లకు 97.24 శాతం అనగా 5820.87 కోట్లు కేటాయించడం జరిగిందని అందులో పంట రుణాల‌ కోసం ...

Read More »

ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌, కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయటానికి 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు నెల‌కు ...

Read More »

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన మార్గదర్శకాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల‌కనుగుణంగా జిల్లాలోని ముస్లింలంతా బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. గురువారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 1వ తేదీన బక్రీద్‌ పండుగ సందర్భంగా కోవిడ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని, ప్రజలు రెండు మీటర్లు లేదా 6 ...

Read More »