Breaking News

2020-21 వార్షిక ఋణ ప్రణాళిక విడుదల

నిజామాబాద్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన 2020-21 వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి విడుదల‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కాంప్‌ కార్యాల‌యంలో జిల్లా వార్షిక ఋణ ప్రణాళికను విడుదల‌ చేసిన అనంతరం మాట్లాడారు. గత సంవత్సరం కంటే 412.18 కోట్ల అధిక మొత్తంతో రూపాయలు 6016.36 కోట్లతో ప్రణాళిక తయారు చేయడం జరిగిందని, ప్రాథమిక సెక్టార్లకు 97.24 శాతం అనగా 5820.87 కోట్లు కేటాయించడం జరిగిందని అందులో పంట రుణాల‌ కోసం 3422.81 కోట్లు కేటాయించారన్నారు.

బల‌హీన అట్టడుగు వర్గాలైన ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, నిరుద్యోగ యువత తదితరుల‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని, నిజామాబాద్‌ జిల్లాలోని బ్యాంకులు తమకు కేటాయించిన ల‌క్ష్యాల‌ను సకాలంలో పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article