Breaking News

రక్తదానం

కామారెడ్డి, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చెందిన హీనా అంజుమ్‌ 30 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ పట్టణ కేంద్రంలోని అఖిల‌ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది.

వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో బిగ్‌ సి మొబైల్స్‌ స్టోర్‌ మేనేజర్‌ రమేష్‌ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు 9492874006 కు సంప్రదించినట్లయితే రక్తదానం చేయడానికి సిద్ధమని బాలు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, రోగి బంధువులు, టెక్నీషియన్‌ యేసుగౌడ్‌ ఉన్నారు.

Check Also

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో ...

Comment on the article