Breaking News

12 నుంచి నిరవధిక సమ్మె

నిజామాబాద్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ సప్లై హమాలీల‌ గత ఒప్పందం డిసెంబర్‌ 31, 2019తో ముగిసిందని, నూతన వేతన ఒప్పందం జనవరి 1, 2020 లో అమలులోకి రావాల్సినా ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అమలు జరగలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య అన్నారు. ఈ మేరకు గురువారం ఏఐటీయూసీ జిల్లా కార్యాల‌యంలో సివిల్‌ సప్లై హమాలీ ముఖ్య కార్యకర్తల‌ సమావేశం నిర్వహించారు. అనంతరం సమ్మె నోటీసును సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డిఎం అభిజిత్‌ సింగ్‌కి అందజేశారు.

ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ కార్మికుల‌ సమస్యల‌కు సంబంధించిన వినతిపత్రాన్ని గత డిసెంబర్‌ నుండి నేటి వరకు అనేక సందర్భాల‌లో అధికారుల‌కు సమర్పించామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిషనర్‌ మార్చి బడ్జెట్‌ సమావేశాల‌ అనంతరం యూనియన్‌ నాయకత్వంతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చి నేటికీ అమలు జరపకపోవడంతో గత్యంతరం లేని సందర్భంలో సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌ సందర్భంగా సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ హమాలీలు ఇతర కార్మికులు రెడ్‌ జోన్‌ ఏరియాల‌కు కూడా రేషన్‌ సరుకులు సరఫరా చేస్తూ నిర్భయంగా పనిచేసినా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి యూనియన్‌ నాయకత్వంతో చర్చించి సమస్యల‌ పరిష్కరించాల‌ని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా సివిల్‌ సప్లై హమాలీ బస్తా రేటు క్వింటాలుకు 24 రూపాయలు పెంచాల‌ని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాల‌ని, సంవత్సరానికి 10 వేల‌ బోనస్‌ ఇవ్వాల‌ని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాల‌ని, మహిళా స్వీపర్ల ఏడున్నర వేల‌ కనీస వేతనం అమలు చేయాల‌ని, ప్రతి కార్మికునికి రెండు జతల‌ బట్టలు, కుట్టు కూలీ 1200 రూపాయలు చెల్లించాల‌ని, తెలంగాణ ప్రభుత్వం పేరు ముద్రతో గుర్తింపు కార్డు ఇవ్వాల‌ని, లేనియెడల‌ ఆగష్టు ఏడవ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించి ఆగస్టు 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం దేవేందర్‌, జిల్లా కోశాధికారి పవన్‌, ఫారుక్‌, లింగన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article