Breaking News

మనోధైర్యంతో ముందుకెళ్ళాలి

నిజామాబాద్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి విస్తరిస్తోందని, మండలాల్లో, గ్రామాల్లో కూడా కేసులు వస్తున్నాయని, ఇటువంటి సమయంలో మనం మనోధైర్యం తో ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఎమ్మార్వోలు, మెడికల్‌ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో మనం భయానికి లోను కాకుండా సంయమనంతో వ్యవహరించాల‌ని, ప్లాన్‌ ప్రకారం ముందుకు పోవాల‌ని సూచించారు.

నిజామాబాద్‌లో ఇంతకు ముందు 12 కంటైన్మెంట్‌ జోన్లు పెట్టుకోవడమైనదని, అదేవిధంగా మరోసారి ప్రతి డివిజన్లో కంటైన్మెంట్‌ జోన్లు గుర్తించి ప్రతిపాదనలు పంపాల‌ని, ప్రతి గ్రామంలో హౌస్‌ టు హౌస్‌ సర్వే జరపాల‌ని, ఎక్కువ కేసులు ఉన్న దగ్గర కంటైన్మెంట్‌ జోన్లు పెట్టడం వ‌ల్ల‌ కేసులు తగ్గి ప్రజల‌కు విశ్వాసం పెరుగుతుందన్నారు.

మున్సిపాలిటీలో మున్సిపల్‌ కమీషనర్ల పాత్ర చాలా ముఖ్యమని, అర్బన్‌ ఏరియాల్లో చాలా కేసులు వస్తున్నవని, టెస్టింగ్‌ సెంటర్లు పిహెచ్‌సిలో, అర్బన్‌, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో పెట్టడం జరిగిందని, కోవిడ్ ల‌క్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయాల‌ని, టెస్టింగ్‌ చేసేముందు యాప్‌ లో వారి డేటా పూర్తి చేసిన తరువాత టెస్టింగ్‌ చేయాల‌ని, సింటమ్స్‌ ఎక్కువ ఉన్న వారికి రాపిడ్‌ టెస్ట్‌ లో నెగటివ్‌ వస్తే జిజిహెచ్‌ కు పంపాల‌ని, పాజిటివ్‌ వస్తే వారిని మోనిటరింగ్‌ చేయాల‌ని, మైల్డ్‌ సింటమ్స్‌ ఉన్న వారిని హోమ్‌ ఐసోలాషన్లో ఉంచాల‌ని, వారికి కిట్‌ అందచేయటం, మెడిసిన్‌ ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించాల‌న్నారు. ఆశా వర్కర్లు పాసిటీవ్‌ వచ్చిన వారిని రోజు రెండు సార్లు చూడాల‌ని, దూరంగా ఉండి మాట్లాడాల‌ని, ఏఎన్‌ఎరు ప్రతి రోజు ఫోన్‌ లో మాట్లాడాల‌ని, సీరియస్‌గా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి పంపాల‌ని, మెడికల్‌ ఆఫీసర్లు కూడా ప్రతి రోజు మోనిటరింగ్‌ చేయాల‌న్నారు.

ప్రజల‌కు కోవిడ్‌ పై ఉన్న భయాన్ని పోగొట్టేలా పని చేయాల‌ని, రాపిడ్‌ కిట్లు ఎ్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా వైద్య శాఖాధికారి సుదర్శన్‌, పీడీ డీఆర్డిఓ రమేష్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article