Breaking News

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన మార్గదర్శకాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల‌కనుగుణంగా జిల్లాలోని ముస్లింలంతా బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు.

గురువారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 1వ తేదీన బక్రీద్‌ పండుగ సందర్భంగా కోవిడ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని, ప్రజలు రెండు మీటర్లు లేదా 6 ఫీట్ల దూరం పాటించాల‌ని, ముఖాల‌కు కవర్లు లేదా మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని, చేతుల‌ను సబ్బుతో తరుచుగా 40 నుండి 60 సెకండ్లపాటు కడుక్కోవాల‌ని, తుమ్ము లేదా దగ్గే సమయంలో టిష్యూ పేపర్‌ లేదా రుమాలు అడ్డు పెట్టుకోవాల‌ని లేదా మోచేతిని అడ్డు పెట్టుకొని తుమ్మడం, దగ్గడం చేయాల‌న్నారు.

బహిరంగ స్థలాల్లో ఉమ్మరాదని, షేక్‌ హాండ్‌ ఇచ్చుకోవడం, అలై భలై చేయరాదని, ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినట్లయితే వెంటనే రాష్ట్ర లేదా కేంద్ర హెల్ప్‌ లైన్‌ నబరుకు ఫోన్‌ చేసి సూచనలు తీసుకోవాల‌న్నారు.

సామూహిక ప్రార్థనలు నిషేధించ బడినందున, కోవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశమున్నందున ఈద్గాలో ప్రార్థనలు చేయరాదని, తమ తమ ఇండ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాల‌ని, మసీదులో ఒక్క పర్యాయం రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తూ 50 మందికి మించకుండా ప్రార్థనలు చేసుకోవాల‌ని, అవసరాన్ని బట్టి రెండవ దఫా ప్రార్థనలు చేసేలా చర్యలు తీసుకోవాల‌ని, ప్రార్థన కొరకు మసీదుకు వచ్చే ముస్లింలు ఎవరి ప్రార్థనా గ్రంధాన్ని (జానీ మాజ్‌) వారు వెంట తెచ్చుకోవాల‌ని, వజు ఇంటివద్దనే నిర్వహించుకొని మసీదుకు రావాల‌ని అన్నారు.

మసీదు వద్ద అవసరమైన సానిటైజర్లు ఏర్పాటు చేయాల‌ని, ప్రార్థనకు వచ్చే వారు భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు సానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకునేలా చర్యలు తీసుకోవాల‌ని, ఇమాంలు ప్రార్థనలు వీలైనంత త్వరగా ముగించాల‌ని, చిన్న పిల్ల‌లు, వయోధికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాల‌ని, మసీదు ముందు కోవిడ్‌ జాగ్రత్తలు, మసీదులో ప్రార్థనలు చేయగలిగే గరిష్ట సంఖ్య తదితర విషయాలు ప్రదర్శించాల‌ని, నమాజుకు ముందు లౌడ్‌ స్పీకర్ల ద్వారా తెలియచేయాల‌ని, కెపాసిటీకి మించి భక్తుల‌ను అనుమతించరాదని సూచించారు.

మండీవద్ద మేకలు / గొర్రెలు కొనటానికి గుమికూడరాదని, ఊరి పొలిమేరల్లో జిల్లా యంత్రాంగం సూచించిన స్థలంలోనే మండీలు ఏర్పాటు చేయాల‌ని, జంతు వధ బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, రహదారుల‌పై నిషేధింప బడిరదని, కబేళాల‌ను నిర్ణిత సమయాల‌లో తెరిచేలా, ఆగస్టు ఒకటి, రెండు, మూడవ తేదీలో తెరిచి ఉంచాల‌ని, జంతువుల‌ను కబేళాల‌లో మాత్రమే వధించేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

బక్రీద్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతుల‌ను శుభ్ర పరుచుకుంటూ, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆనందోత్సాహాల‌తో పండుగ జరుపుకోవాల‌ని, మసీదువద్ద, కబేళాల‌వద్ద ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ ప్రజల‌కు విజ్ఞప్తి చేసారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article