Breaking News

బక్రీద్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముస్లిం సోదర సోదరీమణుల‌కు బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ కోవిడ్‌ నేపథ్యంలో బక్రీద్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని, మాస్కులు ధరించాల‌ని, 6 ఫీట్ల భౌతికదూరం పాటించాల‌ని, సానిటైజర్‌ తో కానీ, సబ్బుతో కానీ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాల‌ని అన్నారు.

అలాగే వక్ఫ్‌ బోర్డ్‌ సూచన మేరకు బక్రీద్‌ పండుగ సందర్భంగా ప్రార్థన సమయంలో కానీ, ఖుర్బానీ సమయంలో కానీ మసీదుల్లో, మండీలో, కబేళాల‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల‌ను పాటించాల‌ని జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా బక్రీద్‌ పండుగను ఆనందోత్సాహాల‌తో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, శాంతిసామరస్యాల‌ మద్య జరుపుకుంటారని జిల్లా కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article