Breaking News

గ్రంథాల‌యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఆర్మూర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెండోరా మండలం సావెల్‌ గ్రామంలో గ్రంధాల‌యం ప్రారంభమైంది. గ్రామానికి చెందిన కొండ గంగామణి జనార్దన్‌ దంపతులు సౌజన్యంతో పంచాయతీ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గ్రంధాల‌యాన్ని సర్పంచ్ నేల‌ లావణ్య లింగన్న ప్రారంబించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ లావణ్య మాట్లాడుతూ కొండ గంగామణి జనార్దన్‌ దంపతులు తమ సొంత ఖర్చుతో గ్రంధాల‌యం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

గ్రామ ప్రజలు గ్రంధాల‌యాన్ని వినియోగించుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో గ్రంధాల‌య చైర్మెన్‌ కొండ సంతోష్‌, ఎంపిటిసి పుప్పాల‌ రాజేశ్వర్‌, మాజీ సర్పంచు మహేందర్‌ రెడ్డి, వెంకటేష్‌, కొండ గంగామణి, జనార్దన్‌, నేల‌ శ్రీనివాస్‌, వైద్యులు అంకం గణేష్‌, అన్వేష్‌, అమర్‌, నరేష్‌, శబరినాథ్‌, నవయువత అద్యక్షుడు చింతల‌ గంగాదాస్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 వరకు ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల‌ల‌లోని పీజీ ...

Comment on the article