Breaking News

10 లోగా పూర్తి చేయాలి

నిజాంసాగర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప‌ల్లెలు పల్లె ప్రగతి కార్యక్రమాల‌ ద్వారా ప్రకాశవంతంగా మారుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కుమార్‌ అన్నారు. పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌ ఎంపీడీవో కార్యాల‌యాల‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులు ఆగష్టు 10 లోగా పూర్తిచేయాల‌ని సూచించారు. కంపోస్టు షెడ్ల ఏర్పాటుతో ప్రతి గ్రామం సంపద కేంద్రంగా మారాల‌న్నారు.

ప్రతి మండల‌ కేంద్రంలో మోడల్‌ కంపోస్టు షెడ్డు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. హోమ్‌ స్టీడ్‌ మొక్కల‌కు సంబంధించి ప్రతి ఇంటికి అందించిన మొక్కల‌ వివరాల‌ను పక్కాగా రిజిస్టర్‌లో నమోదు చేయాల‌న్నారు. గ్రామపంచాయతీ నర్సరీలో మిగిలిన మొక్కల‌ను సంరక్షించాల‌ని తెలిపారు. గ్రామాల‌లో మిగిలిపోయిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ల‌క్ష్యాన్ని పూర్తి చేయాల‌ని అన్నారు. ప్రతి గ్రామంలో ఫాగింగ్‌ మిషన్‌ దాతల‌ సహకారంతో లేదా గ్రామపంచాయతీ నిధుల‌తో కొనుగోలు చేయాల‌ని తెలిపారు.

దాతల‌ సహకారంతో బాడీ ఫ్రీజింగ్‌ మిషన్లు పొందాల‌ని సూచించారు. ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం పనులు పూర్తయిన తర్వాత పూర్తయినట్లుగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాల‌ని సూచించారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణం త్వరితగతిన చేపట్టాల‌ని కోరారు. మంకీ ఫుడ్‌ కోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల‌ని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో హరిత హారంలో నాటిన మొక్కలు 85 శాతం బతికే విధంగా చూడాల‌ని సూచించారు. సర్పంచు, కార్యదర్శి సమన్వయంతో పనిచేసి గ్రామాల‌ను ప్రగతిపథంలో నడిపించాల‌ని కోరారు.

స్మశాన వాటికల‌ నిర్మాణం, డంపింగ్‌ యార్డు, అవెన్యూ ప్లాంటేషన్‌ పనుల‌పై సమీక్ష నిర్వహించారు. తిమ్మానగర్‌, పెద్ద కొడప్‌గల్‌, ఖండే బేలూరు, మద్నూర్‌ లోని రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను పరిశీలించారు. రైతు వేదికలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల‌కు పూర్తి స్థాయిలో వివరాలు తెలియ చేసేందుకు రైతు వివరాలు సేకరించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాల‌ని సూచించారు.

నిర్మాణంలో నాణ్యత పాటించాల‌ని కోరారు. ప్రతి రైతు వ్యవసాయ పరంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిని తదితర అంశాలు చర్చించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, ఎంపీపీ కవిత, జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీడీవోలు శ్రీనివాస్‌ గౌడ్‌, యుగేందర్‌, తహసీల్దార్‌ సుధాకర్‌, వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

Check Also

మాగిలో చెత్త బుట్టల‌ పంపిణి

నిజాంసాగర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాల‌యంలో గ్రామస్తుల‌కు గ్రామ ...

Comment on the article