Breaking News

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం జిల్లా నూతన కమిటీని నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా క్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల‌కు, అన్ని ప్రాంతాల‌కు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ నాయకులందరినీ కలుపుకొని సీనియర్లు, నూతనంగా పార్టీలో చేరిన వారందరి కల‌యికతో సమర్థవంతమైన నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కమిటీలో ఉన్న అందరూ కూడా పార్టీ కోసం ఉత్సాహంగా పని చేయాల‌ని, పార్టీలో క్రియాశీల‌కంగా పని చేసి జిల్లాలో భారతీయ జనతా పార్టీని బల‌మైన శక్తిగా తీర్చిదిద్దడానికి అందరు కూడా భాగస్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. కమిటీలో అవకాశం రాని వారికి రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ విభాగాల‌లో అవకాశం ఇవ్వడం జరుగుతుందని, వారందరి (ఆశావహుల‌) పేర్లు కూడా కోర్‌ కమిటీలో తమ దృష్టికి రావడం జరిగిందని వివరించారు.

వారందరికీ వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఎక్కడ అవసరముంటే అక్కడ దశల‌వారీగా బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని, ఎవరినీ నిరుత్సాహ పరచకుండా అందరిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశామని బస్వాల‌క్ష్మినర్సయ్య అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి మనమందరం కలిసి పని చేద్దామన్నారు.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article