Breaking News

దళితుల‌ అణిచివేతపై నిరసన గళం

ఆర్మూర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల‌ అణిచివేత పై ఆర్మూర్‌ పట్టణ శాఖ దళిత మోర్చా బిజెపి శ్రేణులు ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదట దౌర్భాగ్యం ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు దళితుల‌ను హత్య చేయించడం, ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు.

నాటి నుంచి ఆరు సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పాల‌నలో నిన్నటికి నిన్న సీఎం సొంత జిల్లాలో దళితుని భూమి తనకు దక్కలేదని ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. దళిత నాయకుల‌పై అక్రమంగా కేసులు పెట్టి బెదిరింపుల‌కు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మొన్నటికి మొన్న తీన్మార్ మ‌ల్ల‌న్న ప్రభుత్వ అవినీతి అరాచకాల‌ను ఎండ గడితే ఆయనపై కేసులు పెడుతూ తమ గుండా రౌడీ నాయకుల‌తో బెదిరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోటా దళితుల‌పై ఉక్కుపాదం మోపుతు అనగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. దళితుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చే‌యాల‌ని ఆర్మూర్‌ పట్టణ శాఖ దళిత మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు.

Check Also

ఆర్మూర్‌లో లెక్చరర్ల ధర్నా

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా పేరుతో అకస్మాత్తుగా విద్యా సంస్థల‌ను మూసివేసి ప్రైవేట్‌ ...

Comment on the article