Breaking News

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీజీవిపి 8 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్‌ ముందు టీజీవిపి గద్దె వద్ద రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల‌ నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీవిపి 2012 జులై 31 న రాష్ట్ర రాజధాని బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుల‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎన్నో ఉద్యమాలు చేసి, రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాల‌ని దేశ రాజధాని ఢల్లీిలో 48 గంటల‌ నిరాహార దీక్ష చేసి, పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌ ముట్టడిరచిన ఘనత టీజీవిపిదన్నారు. రాష్ట్ర ఏర్పాటుకై ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి స్వరాష్ట్రం సాధించడం కోసం గల్లీ నుండి ఢల్లీి వరకు ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో నాణ్యమైన విద్యకోసం విద్యార్థుల‌ పక్షాన నిల‌బడి ఉద్యమించిన ఘనత టీజీవిపిది అన్నారు. టీజీవిపి ప్రొఫెసర్‌ జయ శంకర్‌, చాకలి ఐల‌మ్మ, కొమురం భీమ్‌, కొండ ల‌క్ష్మణ్‌ బాపు జి, తెలంగాణ విద్యార్థి అమర వీరుల‌ ఆశయ సాధనకై పోరాడుతుందని వివరించారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిందే నితిన్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కోత్మిర్‌ కర్‌ రామకృష్ణ, భూంపల్లి భూపాల్‌, హరీష్‌, సంతోష్‌, శ్రీకర్‌, కృష్ణ ప్రసాద్‌, రాజ శేఖర్‌, విశాల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు చట్టాలను ...

Comment on the article