Breaking News

Monthly Archives: August 2020

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామరెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానం చేసే వారికి కావల‌సిన రవాణా సదుపాయాల‌ను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా ...

Read More »

దివ్యాంగుడికి చేతికర్రల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వికలాంగుల‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నసురుల్లాబాదు మండలం నాచుపల్లికి చెందిన అబ్దుల్‌ అబీబ్‌ సాబ్‌ అనే దివ్యాంగుడికి సోమవారం చేతికర్రల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల‌ మేరకు పంపిణీ చేసినట్లు ఐసిడిఎస్‌ పిడి అనురాధ తెలిపారు.

Read More »

8 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జనహిత భవనంలో ఉపాధిహామీ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం, స్మశాన వాటిక పురోగతిపై సమీక్ష చేశారు. కంపోస్టు షెడ్లను సెప్టెంబర్‌ 8 లోగా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రైతు కల్లాలు ప్రతి సాంకేతిక సహాయకుడు ఇరవై ఐదు చొప్పున పూర్తిచేయాల‌ని కోరారు. గ్రామాల్లో అర్హత గల‌ ...

Read More »

జిల్లా ముఖ్య అధికారి జన్మదినం నేడు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన జన్మదినం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ జనహిత భవన్‌లో కేక్‌ కట్‌ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి, వివిధ శాఖల‌ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read More »

పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ దుకాణాల్లో కార్డు వినియోగదారులు బియ్యం తీసుకోవడానికి వస్తేనే వారి వేలిముద్రతో బియ్యాన్ని అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నెల‌ 20వ తేదీ వరకు బియ్యాన్ని డీల‌ర్లు వినియోగదారుల‌కు అందించాల‌ని సూచించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరిగిన తహసీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీలో వడ్లను రైస్ మిల్లుల‌ ద్వారా సెప్టెంబర్‌ 2 ...

Read More »

ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ కార్యాల‌యంలో శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్‌ఐ గాండ్ల విట్టల్‌కు పదవీ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్లో ఎస్‌ఐ విటల్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. 36 సంవత్సరాలు ఎస్‌ఐగా ఎన్నో ఉత్తమ సేవా పతకాల‌ను అందుకున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టరేట్‌లో అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ఐ ...

Read More »

మంచి శాస్త్రవేత్తగా ఎదగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్‌ కాల్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఎన్నో అను వైజ్ఞానిక ప్రదర్శన ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుండి 25 ప్రదర్శనలు నమోదు చేసుకోగా మహేందర్‌ ప్రదర్శన విద్యుత్‌ లేకుండా నీటిని ఎత్తిపోతల‌ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ప్రదర్శన జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. కాగా సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చేతుల‌ మీదుగా విద్యార్థికి సర్టిఫికెట్‌ ...

Read More »

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ వార్షిక ప్రణాళిక వివరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ యానిమల్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020-21 పై జిల్లా కమిటీతో కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఈ సంవత్సరం మేషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవల‌ప్‌మెంట్‌ హార్టిక‌ల్చ‌ర్‌ కింద వార్షిక ప్రణాళిక ఆమోదించింది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఈ సంవత్సరం 79 హెక్టార్ల ఏరియాలో పండ్ల తోటలో పెట్టుబడిని 18 ల‌క్షల‌ 66 వేల‌ రూపాయల‌ ...

Read More »

పలువురికి పాల‌నా బాధ్యతలు

డిచ్‌పల్లి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం ఉపకుల‌పతి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సోమవారం ఉదయం తన చాంబర్‌లో పలువురు అధ్యాపకుల‌కు వివిధ పాల‌నా పరమైన పదవులు ఆర్డర్‌ పత్రాలు జారీ చేశారు. ఆచార్య కె. శివశంకర్‌ డీన్‌, డెవల‌ప్‌ మెంట్‌ యూజీసీ ఎఫైర్స్‌ మరియు నోడల్‌ ఆఫీసర్‌-రూసా, ఆచార్య పి. కనకయ్య డైరెక్టర్‌ ఎక్స్టెన్షన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌, డా.పాత నాగరాజు పరీక్షల‌ నియంత్రణాధికారి, ...

Read More »

టెస్టులందు కోవిడ్‌ టెస్టులు వేరయా….

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తె‌లు‌గులో వేమన అనే కవి నాడు బుడ్డగోచీ పెట్టుకొని నీతి శతకాన్ని రాశాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని పెట్టాడు. అది నేటికి నీతివిద్యగా కొనసాగుతుంది. నీతి అయినా, నిజం అయినా ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు.. ఎవరినుంచైనా స్వీకరించాల్సిందే… సరే ఆ విషయం పక్కన పెడితే… గత ఐదారుమాసాలుగా కోవిడ్‌ అనే మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలోని చాలా దేశాల్ని అతలా కుతలం చేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో మానవ ...

Read More »

ఇక నుంచి మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు

నిజామాబాద్‌, ఆగష్టు 29 ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లుగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌ అధికారాలు రెడీ అవుతున్నకొత్త రెవెన్యూ కోడ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ కోడ్‌తో భూ లావాదేవీల‌ స్వరూపమే మారబోతున్నది. డివిజన్‌ స్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో జరిగే రిజిస్ట్రేషన్లు ఇక మండల‌ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. భూముల‌ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అధికారాల‌ను తహసీల్దార్లకు అప్పగించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్లను మండల్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (ఎంఎల్‌ఏఓ)గా వ్యవహరించేలా చట్టంలో మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ...

Read More »

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌కు సంబంధించిన కోవిడ్‌ టెస్టుల‌ను బీర్కూర్‌ పిహెచ్‌సిలో శనివారం నిర్వహించారు. మొత్తం 69 టెస్టుల‌కు‌ గాను 20 మందికి పాజిటివ్‌, 49 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు.

Read More »

కుంటలో చేప పిల్ల‌ల విడుదల‌

నిజాంసాగర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మంగళూరు గ్రామ శివారులో గల‌ కొత్త కుంటలో సర్పంచ్‌ గైని స్వప్న రమేష్‌, ఉప సర్పంచ్‌ దత్తు కలిసి చేపపిల్ల‌లు విడుదల‌ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల‌ కోసం 100 శాతం సబ్సిడీ కింద చేపపిల్ల‌ల‌ను ఇవ్వడం జరుగుతుందన్నారు. మత్స్య కార్మికుల‌ గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుపేద కుటుంబాల‌ను అన్ని రకాలుగా ఆదుకోవడం ...

Read More »

గ్రామాభివృద్ధే నా ల‌క్ష్యం

నిజాంసాగర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ అభివృద్ధి తన ల‌క్ష్యమని మంగళూరు గ్రామ సర్పంచ్‌ స్వప్న రమేష్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం మంగళూరు గ్రామపంచాయతీ కార్యాల‌యంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌తో జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల‌ గురించి చర్చించారు. గ్రామంలో మురికి కాలువ‌లు ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ పౌడర్‌, పిచికారి చేయడం జరుగుతుందన్నారు. త్వరలో పల్లె ప్రకృతి వనం కూడా పూర్తి దశకు చేరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ...

Read More »

రెండు కళాశాల‌లను ప్రారంభించాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజూరైన పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లను ప్రారంభించాల‌ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కి బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లు లేకపోవడం వ‌ల్ల‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కామారెడ్డి 6 జిల్లాల‌కు కేంద్రంగా ఉందని, ఇక్కడ టెక్నికల్‌ విద్యాసంస్థలు లేకపోవడం వ‌ల్ల‌ ఇతర ...

Read More »

వంద శాతం హాజరయ్యేలా చూడాలి

కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతుల‌కు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్లో విద్యాశాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. టీవీలు లేని పేద విద్యార్థుల‌ను గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాల‌యాల్లో పాఠాలు వినే విధంగా చూడాల‌న్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. విద్యార్థుల‌కు ఏమైనా సందేహాలుంటే ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాల‌ని కోరారు. ఆన్‌లైన్‌ తరగతుల‌ సమయంలో ...

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయేషా 28 సంవత్సరాల‌ గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తం బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన అంకాపు నవీన్‌ సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సకాలంలో స్పందించి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీల‌కు రక్తం ల‌భించడం లేదని అలా ఎవరైనా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నట్లు అయితే వారు 9492874006 నెంబర్‌కి ...

Read More »

మౌలిక వసతుల‌ ఏర్పాటుకు కృషి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మౌలికవసతుల‌ ఏర్పాట్ల కోసం మంజూరైన 63 కోట్ల రూపాయల‌తో చేపట్టిన పలు పనుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికల్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. మాంసాహార మార్కెట్ల ఏర్పాట్ల విషయంలో స్థలాన్ని పరిశీలించామని, టెండర్లు పూర్తవగానే త్వరితగతిన పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Read More »

బీమా వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట బీమా వంద శాతం పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్లో శనివారం అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఎఈవోలు క్లస్టర్‌ పరిధిలోని రైతులందరికీ భీమా చేయాల‌ని సూచించారు. పంట సాగు వివరాలు ఆన్‌లైన్‌లో వందశాతం నమోదు చేయాల‌ని కోరారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పిట్లం మండలంలో 600 మెట్రిక్‌ టన్నుల‌ యూరియా ప్రైవేటు డీల‌ర్ల వద్ద ఉందని, లాక్‌ డౌన్‌ కారణంగా ...

Read More »

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు కోవిడ్‌ నిబంధనల‌కు అనుగుణంగా నిర్వహించాల‌ని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం తన ఛాంబర్లో పాలి సెట్‌ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల‌ అధికారుల‌తో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్‌ 2 వ తేదీ ఉదయం 11.00 గంటల‌ నుండి 1.30 గంటల‌ వరకు నిర్వహించే పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌ను పరీక్ష సెంటర్‌కు 10 గంటల‌ నుండి అనుమతిస్తారని ...

Read More »