Breaking News

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

వర్ని, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావ్‌ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో చింతకుంట అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మదన్‌ మోహన్‌ రావు ఎంతో మంది యువకుల‌కు ఉపాధి అవకాశాలు కల్పించారని, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి గల్లీలో కరోన నివారణ కొరకు స్వంత ఖర్చుతో సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారి చేయించారన్నారు. వారు ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్ళు జీవించాల‌ని భగవంతుణ్ణి కోరుతున్నామన్నారు.

రాబోవు రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాల‌ని ప్రజల‌కు మరింత సేవ చేయాల‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ గౌడ్‌, హరినారాయణ, తోట రాజు, అశోక్‌, ఫారం సాయిలు, ఇంతియాజ్‌, చింటూ నాయకులు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article