కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల‌తో మాత్రమే పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ పండుగ ప్రార్థనలు చేసి కరోనా మహమ్మారితో దేశ ప్రజల‌ను, ప్రపంచాన్ని కాపాడాల‌ని దేవుని ప్రార్థించారు.

కరోనాతో ఆరు నెల‌ల నుండి పనులు దొరకక ఉపవాసాలు, బాధల‌తో ఎంతో మంది అతలాకుతల‌మవుతున్నారని, వారందరు కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడాల‌ని నమాజ్‌ చేసి ప్రార్థించాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి సున్నిత సమయంలో దేశ ప్రధాని సూచించిన విషయాలు క్రమశిక్షణతో ప్రతి ఒక్క ముస్లిం అమలు చేశారన్నారు. 90 శాతం మంది ముస్లింలు షాపింగ్‌ు చేయకుండా పాత బట్టల‌తోనే బక్రీద్‌ జరుపుకున్నారన్నారు.

కరోనా అదుపులో ఉన్న సమయంలో ప్రభుత్వాలు వైన్స్‌ు, మద్యం దుకాణాలు తెరిచి ప్రజలు ఎంతో నిబద్ధతతగా పాటిస్తున్న లాక్‌ డౌన్‌ను ప్రభుత్వాలు అపహాస్యం చేశాయని అన్నారు. ఇప్పటికైనా అందరి సల‌హాలు సూచనలు తీసుకుని కరోన మహమ్మారికి మందు వచ్చేవరకు లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసి ప్రతిపక్షాల‌, మేధావుల‌, సైంటిస్టుల‌ డాక్టర్ల సూచనలు సల‌హాలు తీసుకొని దేశ ప్రజల‌ను కాపాడాల‌ని కోరారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article