Breaking News

వారిది పెద్ద మనసు

నిజామాబాద్‌, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌జి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు తెలంగాణ ప్రముఖ జానపద గాయని రెల‌రే గంగా తమ పెద్ద మనసు చాటుకున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా నకిరేకల్‌ మండల‌ గ్రామ పంచాయతీలో ఆటో డ్రైవర్‌ కదిరే సైదులు వారి తల్లి, భార్యా ముగ్గురు చిన్న పిల్ల‌లు కరోనాతో పోరాడుతున్న విషయం తెలుసుకొని జాగృతి నకిరేకల్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ డా.టిజి లింగం గౌడ్‌ ద్వారా నిత్యవసర సరుకులు అందజేశారు.

నిత్యం గ్రామ ప్రజల‌కు సేవ‌లు అందిస్తున్న ఆ కుటుంబ సభ్యులు తొందరగా కోలుకోవాల‌ని రెల‌రే గంగా తన వంతు సహాయాన్ని అందించారు. బాదం పప్పు, జీడి పప్పు, ఖర్జూర పండ్లు, ఎండు ద్రాక్ష, పల్లి పట్టీలు, నువ్వుల‌ పట్టీలు, గుడ్లు, క్యారెట్లు, బిస్కెట్లు, పండ్లు, సబ్బులు, పేస్టు ఇతరత్రా వస్తువులు అందజేశారు. కాగా సైదులు కుటుంబ సభ్యులు గంగకు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని ...

Comment on the article