కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు నీటి నిల్వను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లోని టైర్లలో ఉన్న నిలువ నీటిని తీసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా లార్వా దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల పదినిమిషాలకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోని పూల కుండీలో, కూలర్లు, టైర్లలో, డ్రమ్ములో, పాత్రలలో నిలువ ఉన్న నీటిని తొలగించాలన్నారు.
తద్వారా దోమలు పునరుత్పత్తి చెందకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు నివారించవచ్చని, ప్రజలు తమ ఇండ్లలో నీరు నిలువ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆయన కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021