Breaking News

అందరు సహకరించండి…

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారితో కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరగడంతో ఆగస్టు 5 తేదీ నుండి 14 తేదీ వరకు అన్ని దుకాణాలు స్వచ్చందంగా బంద్‌ పాటించడం జరుగుతుందని తెరాస పార్టీ సీనియర్‌ నాయకులు నిట్టు వేణు గోపాల్‌ రావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌, ఛాంబర్స్‌ ఆఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గజవాడ రవికుమార్‌ అన్నారు.

ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌ ఆండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో అఖిల‌ పక్షం, ఛాంబర్స్‌ ఆఫ్‌ కామారెడ్డి, కిరాణ వర్తక సంఘము ఆధ్వర్యంలో విలేకరుల‌తో మాట్లాడారు. దయచేసి పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అర్థం చేసుకొని సహకరించాల‌ని తెలిపారు. కరోన కట్టడి చేయాలంటె తప్పకుండా స్వీయనియంత్రణ పాటించాల‌ని తెలిపారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని, మన ప్రాణం కన్నా గొప్పది ఏమి లేదన్నారు.

మనం ప్రాణంతో ఉండాలంటే తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాల‌ని, ముఖ్యంగా పట్టణ ప్రజలు దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కోరారు. కార్యక్రమములో సీపీఐ పార్టీ నాయకులు, బీజేపి నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు, తెరాస నాయకులు, వార్డు కౌన్సిల‌ర్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article