Breaking News

ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, రైతు వేదికలు, శానిటేషన్‌, డంపింగ్‌ యార్డు ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ లేబర్‌ టర్న్‌ ఔట్‌ తదితర అంశాల‌పై సంబంధిత అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. కోవిడ్‌ ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి లేదు కాబట్టి మనం ప్రభుత్వ పనులు, ప్రోగ్రాంలు చేయాల‌ని, కోవిడ్‌ విషయంలో భయపడవద్దని, అలా అని అశ్రద్ధ చేయవద్దని, కోవిడ్‌ నేపథ్యంలో ప్రజావాణి కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని, సిబ్బందికి ల‌క్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్‌ చేసి ఐసోలేషన్లో ఉంచాల‌ని, మన దగ్గర కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో ఇచ్చే మందులు జిల్లా ఆసుపత్రిలో వున్నాయని, ఎవ్వరూ బయపడవద్దని అన్నారు.

ప్రతి జిల్లా అధికారి టార్గెట్‌ ఓరియంటెడ్‌గా పనిచేయాల‌ని, ప్రతి శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల‌ని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వివిధ శాఖల‌ హరితహారం టార్గెట్లపై సమీక్షించి టార్గెట్లు పూర్తి చేయని వారు 15 ఆగస్ట్‌ నాటికి పూర్తి చేయాల‌ని, అన్ని శాఖల‌ అధికారులు తమ రెగ్యుల‌ర్‌ పనుల‌తో పాటు ఉదయం హరితహారం చేయాల‌ని ఆదేశించారు.

పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి, నేషనల్‌ హైవేస్‌ రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండేవిధంగా చర్యలు చేపట్టాల‌న్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, మొక్కలు 5 మీటర్ల గ్యాప్‌తో పెట్టాల‌ని, ఏ ఒక్క రోడ్డు మిగల‌కూడదని, రోడ్‌ సైడ్‌ పెట్టే మొక్కలు రెండు మీటర్ల ఎత్తు ఉండాల‌ని అన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో మంగళవారం నుండి 100 శాతం లేబర్‌ వచ్చేలా చూడాల‌ని, ప్రతి గ్రామంలో రోజూ శానిటేషన్‌ చేయాల‌ని, 106 రైతు వేదికల‌కు గాను 104 మొదలు పెట్టారని, పనులు చురుకుగా సాగుతున్నాయని 15 ఆగస్ట్‌ వరకు పూర్తి అయ్యేలా చూడాల‌న్నారు.

డంపింగ్‌ యార్డ్లు, వైకుంఠ ధామాలు కూడా సకాలంలో పూర్తి చేయాల‌ని, 15 ఆగస్ట్‌ వరకు పూర్తి చేసిన వారికి బెస్ట్‌ మోడల్‌ జిపిగా ప్రకటిస్తామని, ఎరువుల‌కు జిల్లాలో కొరత లేదని, ఎక్కడ అవసరమున్నా అక్కడికి పంపుతామన్నారు. గ్రోమోర్‌ సెంటర్‌లో మందులు నిలువ వున్నవని, అవసరమైన రైతులు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఎఫ్‌ఓ సునీల్‌ హీరామత్‌, సంబంధిత శాఖల‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

19న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19వ తేదీ శనివారం నిజామాబాద్‌ నగరంలోని అన్ని ...

Comment on the article