Breaking News

వాటిని గుర్తించి సీజ్‌ చేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరల‌కు విక్రయించే మెడికల్‌ షాపుల‌ను గుర్తించి వెంటనే సీజ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, డ్రగ్‌ ఏ.డి రాజ్యల‌క్ష్మిల‌ను మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. అధిక ధరల‌కు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాద్యులైన మెడికల్‌ షాపుల‌పై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజల‌కు వాస్తవ ధరకు అందేట్టు చూడాల‌ని ఆదేశించారు.

జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రస్తుతం 25 వెంటిలేటర్లు ఉండగా వాటికి అధనంగా 45 వెంటి లేటర్లు తెప్పించి మొత్తం 70 వెంటి లేటర్లు అందుబాటులోకి తెచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు ఆక్సిజన్‌ ఐసోలేషన్‌ బెడ్లు-149, ఐసియు బెడ్లు-48 అందుబాటులో ఉండగా వాటిని 450 కి పెంచేందుకు వెంటనే 68 ల‌క్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లాకు కోవిడ్‌ చికిత్స కోసం అత్యవసర మందులైన ఫావిబ్లూ 500 స్ట్రిప్పు, 150 రెమిడెసివిర్‌ వాయిల్స్‌ ఇంజక్షన్లు, 20 మల్టీ మానిటరింగ్‌ మీటర్స్‌, 35 ఐసియు ఫ్డోర్‌ కాట్స్‌ వెంటనే పంపాల‌ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల‌ రాజేందర్‌ను మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి కోరారు. మంత్రి చొరవతో జిల్లాకు మంగళవారం కోవిడ్‌ అత్యవసర మందులు చేరుకోనున్నాయి.

కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకోవడానికి ఆర్థిక స్థోమత కలిగిన వారికోసం నాలుగు ప్రయివేట్‌ హాస్పిటల్స్‌కు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 1.తిరుమల‌, 2.హోప్‌, 3.మనోరమ, 4.ప్రతిభ నాలుగు ప్రయివేట్‌ హాస్పిటల్స్‌ రెండు, మూడు రోజుల్లో కోవిడ్‌ చికిత్సను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్‌ నియంత్రణకు, చికిత్సకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రకాల‌ చర్యలు చేపట్టిందని భరోసానిచ్చారు.

The following two tabs change content below.

Check Also

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ...

Comment on the article