Breaking News

ప్రముఖ కవి ఎండల‌ నర్సింలు మృతి

నిజామాబాద్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ కవి విశ్రాంత తెలుగు పండితుడు ఎండెల‌ నరసింహులు ఆదివారం మరణించారు. నరసింహులు ఇటీవల‌ శ్రీ ల‌క్ష్మీ నరసింహస్వామి శతకం, కుంతీపుత్ర శతకము రచించారు. జిల్లాలో, రాష్ట్రంలో జరిగిన పలు కవిసమ్మేళనాల‌లో పాల్గొని తమ కవితా గానం చేశారు. పద్య రచనలో చేయి తిరిగిన ఆయన ఎన్నో ఖండికలు రచించారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని భాషాభిమానాన్ని చాటారు. ఆయన మరణం పట్ల హరిదా రచయితల‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఘనపురం దేవేందర్‌, డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు, తెలంగాణ రచయితల‌ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నరాల‌ సుధాకర్‌, గుత్ప ప్రసాద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article