Breaking News

అవసరమైన మెటీరియల్‌ అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల‌ నిర్మాణం పై సంబంధిత అధికారుల‌తో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 106 రైతు వేదికల‌కు గాను 104 మొదలు పెట్టారని, వాటి పురోగతి, సమస్యలుంటే వాటి పరిష్కారానికి చేపట్టవల‌సిన చర్యలు తదితర అంశాల‌పై సమీక్షించారు.

ప్రతి మండలంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల‌కు సంబంధించిన కాంట్రాక్టర్‌ మరియు అధికారుల‌తో సమీక్షించారు. కొన్ని రైతు వేదికల‌ పనులు సరిగా లేవని, వాటిని తొందరగా పూర్తి చేయాల‌ని, అవసరమైన మెటీరియల్‌ను శనివారం వరకు డంప్‌ చేయాల‌ని, బేస్మెంట్‌ లెవెల్‌ పూర్తి చేసిన వాటికి బిల్‌ పేమెంట్‌ చేయాల‌ని, రైతు వేదికలు ఎంత తొందరగా పూర్తిచేస్తే రైతుకు అంత మేలు చేసిన వారమవుతామని, కావున సకాలంలో పూర్తి చేయాల‌ని, కష్ట పడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాల‌ని, 10 ఆగస్ట్‌ వరకు పూర్తి చేయాల‌ని సూచించారు.

కార్యక్రమంలో ఆర్డీవో రవి, పంచాయతీ రాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శంకర్‌, మండల‌ రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖల‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article