Breaking News

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి అని ఖలీల్‌ వాడి తెలుగు మీడియం ఇంచార్జ్‌ పిజి హెచ్‌ఎం గంగయ్య అన్నారు. మంగళవారం 300 కోటర్స్‌లోని ఖలీల్‌వాడి హైస్కూల్‌లో వందన కుమారి పదవీ విరమణ కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనల‌కు లోబడి నిర్వహించారు. కార్యక్రమానికి గంగయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

గత 27 సంవత్సరాలు తను సర్వీస్‌ను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది విద్యార్థుల‌ను తన సబ్జెక్టులో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వందన కుమారిదన్నారు. క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ పాఠశాల‌ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. గృహిణిగా, ఉపాధ్యాయురాలిగా తన వంతు కర్తవ్యాన్ని పాటించడం గొప్ప విషయమని గంగయ్య చెప్పారు. అనంతరం పాఠశాల‌ సిబ్బంది ఆమె సోదరులు, బంధువులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

పాఠశాల‌కు వందన కుమారి అందించిన సేవల‌కు గుర్తుగా ఖలీల్‌ వాడి హై స్కూల్‌ సిబ్బంది జెండా గల్లి ప్రాథమిక పాఠశాల‌ ఉపాధ్యాయ బృందం, సోదరులు, బంధువులు శాలువాతో, పూల‌దండల‌తో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖలీల్‌ వాడి ఇన్చార్జ్‌ హెడ్మాస్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, జెండాగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌ ప్రధానోపాధ్యాయుడు రామ్‌ చందర్‌ గైక్వాడ్‌, పదవి విరమణ పొందిన వందన కుమారి భర్త రిటైర్డ్‌ తహసిల్దార్‌ వెంకటేశం, పాఠశాల‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article