Breaking News

శతాబ్దాల కల‌ సాకారమైంది

కామారెడ్డి, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అయోద్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన సందర్బంగా పార్టీ కార్యాల‌యంలో మిఠాయిలు పంచుకొని, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ హిందువుల‌ 5 శతాబ్దాల కల‌ నెరవేరిందని యుగ పురుషునికి ఆల‌యం నిర్మితం కాబోతోందని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటు పోట్లు ఎంతోమంది కరసేవకుల‌ ప్రాణత్యాగాలు వృదాకాలేదని అన్నారు.

ఆగష్టు 5 భూమి పూజా కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. బీజేపీ తాను ఇచ్చిన వాగ్ధానాన్ని నిల‌బెట్టుకుందని నేడు మోడీ అయోధ్య రామాల‌య నిర్మాణానికి భూమి పూజ చేసి హిందువుల‌ చిరకాల‌ వాంఛను నెరవేర్చారన్నారు.

The following two tabs change content below.

Check Also

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు ...

Comment on the article