Breaking News

మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఇందులో నవోదయ విద్యాల‌యానికి చెందిన వారు ఉన్నారన్నారు.

నిజాంసాగర్‌ మండలంలోని కరోన పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 16 కు చేరిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌ ధరించాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా బయటకు వెళ్తే శానిటైజర్‌, మాస్క్‌ తప్పనిసరిగా వాడాల‌న్నారు.

Check Also

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ ...

Comment on the article