Breaking News

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికోసం మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ జిల్లాలో మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉండి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండటానికి అవసరమైన వసతులు లేనివారి కోసం అన్ని వసతుల‌తో మాక్లూర్‌ లోని నర్సింగ్‌ కాలేజీలో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, సెంటర్లో 24 గంటలూ డాక్టర్‌ ఉండేలా చర్యలు తీసుకున్నామని, భోజన వసతి కూడా కల్పించామని తెలిపారు.

సౌకర్యాన్ని వినియోగించుకోదల‌చిన వారు 9666147296 నెంబర్‌కు కాల్‌ చేసి వివరాలు తెలిపితే అంబులెన్సు ఏర్పాటు చేసి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

The following two tabs change content below.

Check Also

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ...

Comment on the article