Breaking News

పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిపాల‌ వారోత్సవాల‌ సందర్భంగా బుధవారం ఐసిడిఎస్‌ ఎల్లారెడ్డి ఆద్వర్యంలో సిడిపివో సరిత, సిబ్బంది, అంగన్‌వాడి టీచర్‌ు ఎల్లారెడ్డి పట్టణంలోని బాలింతల‌ ఇంటికి వెళ్ళి తల్లిపాల‌ ప్రాముఖ్యతను వివరించారు.

తల్లి పాలు తాగడం బిడ్డ జన్మహక్కు అని, తల్లిపాల‌లో శిశువు ఎదగడానికి సహాయపడే ప్రోటీన్లు, విటమిన్లు వంటివి సమపాళ్ళలో ఉండడం వల‌న తల్లిపాలు బిడ్డ యొక్క పోషక అవసరాల‌ను తీర్చడంలో సహాయపడడంతో పాటు బిడ్డ యొక్క పెరుగుదల‌ అభివృద్ధికి మరియు మానసిక అభివృద్దికి తోడ్పడతాయని చెప్పారు. బిడ్డకు భవిష్యత్తులో ఉబ్బసం, గుండె జబ్బు, శ్వాసకోశ వ్యాధుల‌ నుండి కాపాడడంలో తల్లిపాలు ఉపయోగపడతాయని, తల్లిపాల‌ ద్వారా రోగనిరోధక శక్తి పెంచవచ్చన్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాల‌ని, బిడ్డను తాకటానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో ఏసిడిపివో సునంద, సూపర్‌వైజర్‌ సంగమేశ్వరి, పోషన్‌ అభియాన్‌ సమన్వయ కర్త ప్రసాద్‌, కళ్యాణి, సావిత్రి పాల్గొన్నారు.

Check Also

ఆరోగ్యం, స్వచ్ఛత కోసమే ఆ నిర్మాణాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల నగరంలోని గౌతమ్‌ ...

Comment on the article