Breaking News

ఆఫీసుకు పబ్లిక్‌ రావటాన్ని తగ్గించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డు, హరితహారం, వైకుంఠధామం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లేబర్‌ టర్నోవర్‌ తదితర అంశాల‌పై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డిఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మెడికల్‌ ఆఫీసర్లు, అటవీశాఖ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

కోవిడ్‌ నేపధ్యంలో ప్రతి ఒక్క అధికారి తమ సిబ్బందితో పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పబ్లిక్‌ను వీలైనంత వరకు ఫోన్‌ ద్వారా, వాట్సాప్‌ ద్వారా మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఆఫీసుకు పబ్లిక్‌ రావటాన్ని తగ్గించాల‌ని తెలిపారు. మున్సిపాలిటీలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డివోలు, మెడికల్‌ ఆఫీసర్లు చాలెంజ్‌గా తీసుకోవాల‌ని, లోకల్‌ కేబుల్‌ టీవీ ద్వారా, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాల‌ని, మాస్క్‌ ధరించని వారికి జరిమానా వేయాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించని దుకాణాల‌ను మూసేయాల‌ని, గ్రామాల‌లో కూడా దృష్టి పెట్టి వైరస్‌ వ్యాప్తి కాకుండా నియంత్రించాల‌ని, లోకల్‌ బాయ్స్‌, గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాల‌ని, మండల‌ టీమ్స్‌, మెడికల్‌ ఆఫీసర్స్‌, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు చురుకుగా పనిచేయాల‌ని సూచించారు.

ల‌క్షణాలున్న వారిని వెంటనే పరీక్షలు చేయించాల‌ని, అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్‌ స్టార్ట్‌ చేయాల‌ని, సి విటమిన్‌, డి విటమిన్‌ టాబ్లెట్స్‌, కిట్టు అదేవిధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఈ విధంగా చేయడం వ‌ల్ల‌ 99 శాతం మరణాలు ఉండవని తెలిపారు. ఫీవర్‌, కోల్డ్‌ ఉన్నవారిని రిజిస్టర్‌ లో నమోదు చేయాల‌ని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు, అటవీ ల్యాండ్స్‌, ఫీల్డ్‌ ఇన్స్పెక్షన్‌ రెండు రోజుల్లో పూర్తిచేయాల‌ని తెలిపారు. ప్రకృతి వనంలో ప్లాంటేషన్‌ చేయడం వ‌ల్ల‌ హరితహారం టార్గెట్‌ రీచ్‌ కావచ్చన్నారు.

డంపింగ్‌ యార్డ్‌లో సెగ్రిగేషన్‌ పనిచేయుటకు సిబ్బందిని నియమించుకోవాల‌ని, వారికి పంచాయతి నుండి 3 వేలు ఇవ్వాల‌ని, రీసైక్లింగ్‌ చేసిన డబ్బు వారికే ఇవ్వాల‌ని తెలిపారు. రైతు వేదికలు ఆగస్టు 15 వరకు 15 మండలాల్లో పూర్తిచేయాల‌ని, మిగతావి ఆగస్టు 31 వరకు పూర్తిచేయాల‌ని, విద్యుత్‌ సౌకర్యం, డ్రిరకింగ్‌ వాటర్‌, అప్రోచ్‌ రోడ్డు, బోరు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాల‌న్నారు.

బేస్మెంట్‌ లెవెల్‌ అయిన వాటికి ఏఈపి ఆర్తో కలిసి ఎఫ్‌టిఏ జనరేట్‌ చేస్తే నిధులు వస్తాయన్నారు. పల్లె ప్రగతిలో సక్రమంగా అన్ని పనులు చేసిన గ్రామానికి ఆగస్ట్‌ 15 న అవార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఎఫ్‌ఓ సునీల్‌ హీరామత్‌, పిడి డిఆర్‌డిఎ రమేష్‌ రాథోడ్‌. డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article