కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నివారణ చర్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్వేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు గురువారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన కరోనా జ్వరం సీజనల్ జ్వరానికి గల లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేసే బోరచర్లను పోస్టర్ను జిల్లా కలెక్టరు విడుదల చేశారు. ప్రస్తుతం అంటు వ్యాధులు ప్రబలే కాలల కాబట్టి, ఈ కాలంలో వచ్చే వ్యాధి లక్షణాలపై ...
Read More »Daily Archives: August 6, 2020
15లోగా రుణాలు ఇవ్వాలి
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు ఆగస్టు 15 లోగా రుణాలు వంద శాతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో మున్సిపల్ కౌన్సిలర్లు, మెప్మా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు అందరికీ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. నిరుపేదలకు రుణాలు ఇచ్చి వ్యాపారాలు చేసే విధంగా చూడాలన్నారు. వార్డుల్లో పార్కు ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ...
Read More »కామారెడ్డిలో జయశంకర్ సార్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More »సార్ ఆశించిన తెలంగాణ ఇది కాదు
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢల్లీి వరకు తన వాణి వినిపించిన మహోన్నతమైన వ్యక్తి జయశంకర్ ...
Read More »వైరస్ నివారణ చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ, స్థానిక జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో జిల్లాలో కరోనా వైరస్ ...
Read More »పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమలకు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ క్రింద పూచీకత్తు లేని రుణాలు అంధించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమలకు ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజిపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎక్కువ మందికి లబ్ది చేకూర్చే విధంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని పరిశ్రమ ...
Read More »లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి
డిచ్పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అస్తిత్వ సిద్ధాంత కర్త, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 87 వ జన్మదిన వేడుకలు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కోవిడ్ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి, పరిసర ప్రాంతాలలో శానిటైజర్ స్ప్రే చేసి జయంతి ఉత్సవాన్ని జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రిజిస్ట్రార్ ఆచార్య నసీం హాజరై ఆచార్య జయశంకర్ సార్ చిత్ర ...
Read More »