కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నివారణ చర్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్వేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు గురువారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన కరోనా జ్వరం సీజనల్ జ్వరానికి గల లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేసే బోరచర్లను పోస్టర్ను జిల్లా కలెక్టరు విడుదల చేశారు.
ప్రస్తుతం అంటు వ్యాధులు ప్రబలే కాలల కాబట్టి, ఈ కాలంలో వచ్చే వ్యాధి లక్షణాలపై ప్రచార సామగ్రి ద్వారా ప్రచారం కల్పించాలని, కరోనా జ్వరానికి సీజనల్ జ్వరానికి గల తేడా లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామీణ స్థాయిలో ప్రచారం కల్పించాలని, మాస్కులు తప్పక ధరించేలా, వ్యక్తిగత దూరం పాటించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కరోనా కంట్రోల్ రూమ్ నెంబర్లు 7382928649, 7382929350 గ్రామాలలో, పట్టణాలలో తెలిసే విధంగా ప్రచార సామాగ్రి రూపొందించి ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
ప్రచార కరపత్రాల ద్వారా సీజనల్ వ్యాధుల వివరాలు తెలుసుకొని ఎవరికైనా లక్షణాలు వుంటే క్షేత్ర స్థాయిలో తమ వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో చికిత్స లభిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021