Breaking News

పూచీకత్తు లేని రుణాలు అందించడానికి కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు గ్యారెంటీ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ క్రింద పూచీకత్తు లేని రుణాలు అంధించడానికి కలెక్టర్లు కృషి చేయాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు ఆత్మ నిర్బర్‌ అభియాన్‌ ప్యాకేజిపై జిల్లా కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఎక్కువ మందికి ల‌బ్ది చేకూర్చే విధంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని పరిశ్రమ శాఖ జిల్లా మేనేజర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్లతో తరచు సమీక్షలు నిర్వహించాన్నారు. రుణాలు అంధించేందుకు రాష్ట్రాల‌కు ఎలాంటి పరిమితి లేనందున వీలైనంత సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌కు రుణ సదుపాయం కల్పించడంపై కలెక్టర్లు దృష్ఠి సారించాల‌ని పేర్కొన్నారు. క్రెడిట్‌ గ్యారంటీ స్కీం ఫర్‌ సబార్డినేట్‌ డెబిట్‌ క్రింద అర్హత ఉన్న సూక్ష్మ, చిన్న మద్య తరహా పరిశ్రమల‌ జాబితాను అందించాల‌ని బ్యాంకర్లను కోరారు.

బ్యాంకర్లు తమకు కేటాంయించిన ల‌క్ష్యాల‌ మేరకు రుణాలు అంధించాల‌ని కోరారు. సమావేశంలో పురపాల‌క పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, పరిశ్రమల‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కమీషనర్‌ మణిక్‌ రాజ్‌, సంచాల‌కులు డా.ఎన్‌. సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article